
రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి శ్రీరామునికి విజయ రహస్యం ఆదిత్య హృదయాన్ని బోధిస్తున్న దృశ్యం.తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ||
భావం: యుద్ధ రంగంలో అలసిపోయి, చింతాక్రాంతుడై ఉన్న శ్రీరాముని ఎదుట, యుద్ధానికి సిద్ధంగా ఉన్న రావణుడిని చూసి అగస్త్య మహర్షి అక్కడికి వచ్చారు.
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ | ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవాన్ మునిః ||
భావం: దేవతలతో కలిసి యుద్ధాన్ని చూడటానికి వచ్చిన అగస్త్య మహర్షి శ్రీరాముని వద్దకు వెళ్లి ఇలా పలికారు.
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ | యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ||
భావం: ఓ రామచంద్రా! సనాతనమైన, పరమ రహస్యమైన ఈ స్తోత్రాన్ని విను. దీనిని పఠించడం వల్ల యుద్ధంలో నీ శత్రువులందరినీ జయించగలవు.
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ | జయవహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ ||
భావం: పవిత్రమైనది, శత్రువులను నశింపజేసేది, విజయాన్ని ఇచ్చేది మరియు అక్షయమైనది అయిన ఈ ‘ఆదిత్య హృదయం’ అనే స్తోత్రాన్ని నిత్యం పఠించాలి.
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ | చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ||
భావం: ఇది సకల మంగళాలను చేకూరుస్తుంది, సమస్త పాపాలను తొలగిస్తుంది. చింతలను, శోకాన్ని దూరం చేసి ఆయుస్సును పెంచే ఉత్తమమైన స్తోత్రం.
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ | పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ||
భావం: కిరణాలతో ప్రకాశించేవాడు, దేవాసురులచే నమస్కరించబడేవాడు, లోకానికి వెలుగునిచ్చేవాడు అయిన ఆ సూర్యభగవానుని పూజించుము.
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః | ఏష దేవాసురగణాంల్లోకాన్ పాతి గభస్తిభిః ||
భావం: ఈయన సకల దేవతా స్వరూపుడు. తన కిరణాల ద్వారా దేవతలను, అసురులను మరియు సమస్త లోకాలను రక్షిస్తున్నాడు.
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః | మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ||
భావం: ఈ సూర్యభగవానుడే బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలము, యముడు, చంద్రుడు మరియు వరుణుడు.
పితరో వసవః సాధ్యా అశ్వినౌ మరుతో మనుః | వాయుర్వహ్నిః ప్రజాప్రాణః కర్తా ప్రభాకరః ||
భావం: పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని మరియు సకల ప్రాణుల ప్రాణశక్తి ఈయనే.
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ | సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః ||
భావం: అదితి పుత్రుడు (ఆదిత్యుడు), జగత్కర్త (సవిత), ఆకాశంలో విహరించేవాడు (ఖగుడు), పోషకుడు (పూష), వెలుగునిచ్చేవాడు (భానుడు) – ఇలా అనేక రూపాలలో ఆయన ప్రకాశిస్తున్నాడు.
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ | తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంంశుమాన్ ||
భావం: పచ్చని గుర్రములు కలవాడు, సహస్ర కిరణాల వాడు, సప్త అశ్వములపై విహరించేవాడు, చీకట్లను పారద్రోలేవాడు అయిన సూర్యునికి నమస్కారం.
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః | అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ||
భావం: చల్లదనాన్ని ఇచ్చేవాడు, వేడిని ప్రసాదించేవాడు, అగ్ని గర్భంలో కలవాడు, మంచును పోగొట్టేవాడు అయిన భాస్కరుడికి నమస్కారములు.
వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః | ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీప్లవంగమః ||
భావం: ఆకాశానికి అధిపతి, చీకటిని చీల్చేవాడు, వేద స్వరూపుడు, వర్షాన్ని కురిపించేవాడు మరియు వరుణుడికి మిత్రుడు.
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః | కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ||
భావం: కిరణ మాలలు కలవాడు, మృత్యు స్వరూపుడు, సర్వ ప్రాణులను తపింపజేసేవాడు, సకల లోకాల సృష్టికి మూలమైన వాడు.
నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః | తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోఽస్తు తే ||
భావం: నక్షత్రాలకు, గ్రహాలకు అధిపతి. తేజస్సులకే తేజస్సునిచ్చేవాడు. ద్వాదశ రూపాలలో వెలిగే ఓ సూర్యభగవానా! నీకు నమస్కారం.
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః | జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ||
భావం: ఉదయగిరికి, అస్తాద్రికి, జ్యోతులకు అధిపతికి మరియు పగటికి రాజు అయిన సూర్యునికి నమస్కారములు.
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః | నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ||
భావం: విజయాన్ని, శుభాలను చేకూర్చే హర్యశ్వుడికి, వేల కిరణాల ఆదిత్యుడికి అనేక నమస్కారములు.
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః | నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ||
భావం: వీరుడు, శీఘ్రగామి మరియు పద్మాలను వికసింపజేసే సూర్యునికి నమస్కారం.
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే | భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ||
భావం: బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి స్వరూపుడై, ప్రకాశించేవాడై, ప్రళయ కాలంలో అన్నింటినీ భక్షించే రుద్ర రూపానికి నమస్కారం.
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే | కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ||
భావం: చీకటిని, మంచును మరియు శత్రువులను హరించేవాడు, కృతఘ్నులను శిక్షించేవాడు అయిన జ్యోతిష్పతికి నమస్కారం.
తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే | నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ||
భావం: కరిగించిన బంగారం వంటి కాంతి కలవాడు, విశ్వానికి మూలమైన అగ్ని స్వరూపుడు మరియు లోక సాక్షి అయిన భాస్కరుడికి నమస్కారం.
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః | పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ||
భావం: ఈయనే సర్వ భూతాలను లయం చేస్తాడు, మరల సృష్టిస్తాడు. తన కిరణాలతో తపింపజేస్తూ, వర్షాన్ని కురిపిస్తూ లోకాన్ని రక్షిస్తున్నాడు.
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః | ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ ||
భావం: సకల ప్రాణులు నిద్రిస్తున్నా ఈయన మేల్కొనే ఉంటాడు. యజ్ఞ యాగాదుల ఫలితం కూడా ఈయనే.
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ | యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ||
భావం: వేదాలు, యజ్ఞాలు మరియు వాటి ఫలితాలు అన్నీ ఈ సూర్య ప్రభువే. లోకంలో జరిగే సమస్త కార్యాలకు ఈయనే మూలం.
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ | కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ ||
భావం: రాఘవా! ఆపదల్లో, కష్టాల్లో, భయంకరమైన అడవుల్లో ఈ స్తోత్రాన్ని కీర్తించే వారికి ఎన్నడూ ఓటమి కలగదు.
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ | ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ||
భావం: ఏకాగ్రతతో ఈ జగత్పతిని పూజించుము. దీనిని మూడు సార్లు జపించినచో యుద్ధంలో విజయం నీదే అవుతుంది.
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి | ఏవముక్త్వా తదాగస్త్యో जगाమ చ యథాగతమ్ ||
భావం: ఈ క్షణమే నీవు రావణుడిని సంహరిస్తావు అని చెప్పి అగస్త్య మహర్షి వెళ్ళిపోయారు.
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా | ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ||
భావం: దీనిని విన్న శ్రీరామచంద్రుడు శోకాన్ని వీడి, అత్యంత ప్రీతితో ఈ స్తోత్రాన్ని మనస్సులో నిలుపుకున్నారు.
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ | త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ||
భావం: సూర్యుని చూస్తూ స్తోత్రాన్ని జపించి ఆనందాన్ని పొందారు. మూడు సార్లు ఆచమనం చేసి, శుచియై తన ధనుస్సును ధరించారు.
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమః | సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ||
భావం: రావణుడిని చూసి యుద్ధానికి ఉత్సాహంగా సిద్ధమయ్యారు. రావణ సంహారం కోసం దృఢ నిశ్చయంతో పోరాటం మొదలుపెట్టారు.
అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః | నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి ||
భావం: అప్పుడు సూర్యభగవానుడు దేవతల మధ్య ఉండి, రావణ సంహారం తథ్యమని గ్రహించి, పరమ సంతోషంతో శ్రీరాముని చూస్తూ “త్వరపడూ” అని ఆశీర్వదించారు.


